ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ...ఒకరు మృతి నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన సంఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. చిల్లకూరు నుంచి సిలికా లోడ్‌తో బెల్గాం వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అవ్వటంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తు చేస్తున్న సమయంలో బొగ్గు లోడుతో వస్తున్న మరో లారీ వెనుక నించి బలంగా ఢీ కొట్టిడంతో బొగ్గు లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి : జట్ల కొండూరులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి