ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాల్లో నూనె సమస్య పరిష్కారం - anganwadi centres

ఉదయగిరి ఐసీడీఎస్​ ప్రాజెక్టు పరిధిలో ఉన్నఅంగన్వాడీ కేంద్రాల్లో కాలం చెల్లిన వంట నూనె సరఫరా జరిగింది. ఈ విషయం ఆ ప్రాజెక్టు అధికారి దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. వెంటనే అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కారం చేశారు.

అంగన్వాడీ కేంద్రాల్లో పరిష్కారమైన నూనె సమస్య
author img

By

Published : Sep 9, 2019, 11:31 PM IST

Updated : Sep 10, 2019, 12:04 AM IST

అమృత హస్తం పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు మధ్యాహ్నం వేళ పౌష్ఠికరమైన భోజనాన్ని అందిస్తారు. అయితే ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ అధికారులు కాలం చెల్లిన వంట నూనె సరఫరా అయ్యింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలస్యంగా మేల్కొన్న అధికారులు

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు ప్రాజెక్టు అధికారి ఈస్టర్ రాణి. సమస్యను ఉదయగిరి తహశీల్దార్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. చౌక దుకాణాన్ని పరిశీలించి కాలం చెల్లిన వంట నూనె ప్యాకెట్ల సరఫరా అవుతున్నట్లు వారు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. వాటి స్థానంలో కొత్త ప్యాకెట్లను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు.. కాలం చెల్లిన నూనె ప్యాకెట్ల స్థానంలో కొత్త ప్యాకెట్లు సరఫరా చేశారు.

ఇదీ చదవండి:

నిజం దాస్తున్నారు...గుట్టుగా అమ్మేస్తున్నారు!

sample description
Last Updated : Sep 10, 2019, 12:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.