ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం 'కాదు'..! - నెల్లూరులో ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అనే మాటకు ఇప్పుడు కాలం చెల్లింది. కొవిడ్‌-19 విస్తరిస్తున్న నేపథ్యంలో బస్సుల్లో శానిటైజేషన్‌ చేయాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. గమ్యస్థానానికి వెళ్లి వచ్చిన బస్సులో వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టి ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలే ఉండటం లేదు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో కంటికి కనిపించని శత్రువు తన పని తాను చేసుకుపోతోంది. ఆర్టీసీ ఉద్యోగులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు.

no sanitizers
no sanitizers
author img

By

Published : Jul 7, 2020, 9:09 AM IST

నెల్లూరు ఆర్టీసీ డిపో పరిధిలో తిరుగుతున్న గ్రామీణ ప్రాంతాల బస్సుల్లో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టడం లేదు. బస్సులు ఇతర ప్రాంతాల నుంచి రాగానే ప్రయాణికులు వాటిలో కూర్చోవడం, అవి బయలుదేరడం జరుగుతోంది. ఉదయం గ్యారేజీ నుంచి తీసే బస్సుల్లో ఒకసారి మాత్రమే శానిటైజేషన్‌ జరుగుతోంది.

రోజుకు ఒక్కసారే..

గ్యారేజీ నుంచి బస్సులు బయటకు వచ్చే సమయంలోనే ఆర్టీసీ అధికారులు శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఇక్కడి డిపో నుంచి నెల్లూరు, ఉదయగిరి, ఆత్మకూరుకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కావలి బస్టాండు నుంచి నెల్లూరుకు 27 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బస్సు బయలుదేరింది. దీనికి కూడా శానిటైజేషన్‌ చేయకుండా పంపారు.

నాయుడుపేట కూడలి ఆర్టీసీ బస్సుస్టాండు మీదుగా నెల్లూరు, తిరుపతి, పరిసర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాండు నుంచి పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కో ట్రిప్పునకు 30 మంది వరకు ప్రయాణికులు ఎక్కుతున్నారు. బస్టాండు ఆవరణలో ఉదయం పూట శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఇక బస్సులోపల ఎవరూ చేయడం లేదు.

బొబ్బలతో బెంబేలు..

ఆత్మకూరు నుంచి నెల్లూరు, కావలి మార్గంలో బస్సులు తిరుగుతున్నాయి. గమ్యస్థానానికి వెళ్లి వచ్చిన బస్సులో శానిటైజేషన్‌ నిర్వహించడం లేదు. కొద్దిపాటి బ్లీచింగ్‌ పొడిని మిళితం చేసిన నీటిని సీసాల్లో ఏర్పాటు చేసి ఉంచుతున్నారు. అవి అరచేతిలో వేసుకుని రుద్దుకుంటే మంటపుడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ విషయంపై ఆర్టీసీ ఆర్‌ఎం పీవీ శేషయ్యను వివరణకోరగా బస్సులు, బస్టాండ్లలో ప్రత్యేక సిబ్బందితో విడతల వారీగా శానిటేషన్‌ చేయిస్తున్నామన్నారు. ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

రక్షణ చర్యలేవి?

వెంకటగిరి : వెంకటగిరి డిపో నుంచి నిత్యం 30 నుంచి 34 బస్సులు తిరుపతి, గూడూరు, నెల్లూరు, నాయుడుపేట మార్గాలకు తిరుగుతున్నాయి. గ్యారేజీ నుంచి బస్సులు బయటకు వచ్చే సమయంలో శానిటైజర్‌తో పరిశుభ్రం చేస్తున్నారు మినహా ఆ తర్వాత ఆ ఊసే కనిపించడం లేదు. బస్టాండులో ఓచోట ఏర్పాటుచేసిన శానిటైజర్‌ యంత్రంలోని సబ్బు నీటితో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు.

నిబంధనలకు తూట్లు..

ఆర్టీసీ బస్టాండ్లలో శానిటైజరు యంత్రాలు ఏర్పాటుచేసినా బస్సులను శుభ్రం చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. కోట బస్టాండు నుంచి వాకాడు ఆర్టీసీ డిపోకు చెందిన 8 బస్సులు గూడూరు, నెల్లూరుకు నిత్యం 400 మంది వరకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వీరందరూ ఆందోళన చెందుతున్నారు.

డిపోలు :10

  • బస్సులు : 600
  • ప్రస్తుతం తిరుగుతున్నవి 180-200
  • తిరుగుతున్న కిలోమీటర్లు : 30 వేలు
  • ప్రయాణికులు 15 వేల నుంచి 20 వేలు ఆదాయం
  • రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు

ఇదీ చదవండి:

టీ20 ప్రపంచకప్​ వాయిదా.. వచ్చేవారం అధికార ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.