ETV Bharat / state

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో.. వసతులు మృగ్యం - సామాజిక ఆరోగ్య కేంద్రాలు

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో గ్రామీణ వైద్యానికి ఎక్కువ నిధులే కేటాయించారు. వైద్యుల కొరత లేకుండా చేశారు. అధునాతన సాంకేతిక పరికరాలు ఇచ్చారు. ఇన్ని చేసినా భవనాల కొరత కారణంగా వాటి సంరక్షణ భారంగా మారింది. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా సిబ్బంది లేరు.

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మృగ్యం
author img

By

Published : May 11, 2019, 11:03 AM IST

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మృగ్యం

నెల్లూరు జిల్లాలో మొత్తం 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. సీహెచ్​సీల్లో 30 పడకలు... ఏడుగురు వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు వెళ్ళకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాలకే ఎక్కువ వస్తున్నారు. రోజూ 250మంది ఇక్కడ సేవలు పొందుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు ఆరోగ్య కేంద్రాలు జిల్లాలోనే ఉత్తమ సేవలందిస్తున్నాయి.

ప్రస్తుతం పీహెచ్​సీ, సీహెచ్​సీల్లో వైద్యులు ఆపరేషన్లూ చేస్తున్నారు. భవనాల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. నాయుడుపేట, ఇందుకూరుపేట, గూడూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో నూతన భవనాల అవసరం ఉంది. అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలు, భవనాలు సరిగా లేనందున దెబ్బతింటున్నాయి. సరిగా లేని గదుల్లో గైనిక్, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నందున ఇన్ఫెక్షన్​లు సోకుతున్నాయి.

ఎక్స్​రే మిషన్లు, అల్ట్రాసౌండ్ మిషన్లు ఇచ్చి... ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి అదనంగా నలుగురు నర్సులను నియమించాలని రోగులు కోరుతున్నారు. హైడ్రాలిక్ టేబుల్, సెల్ కౌంటర్, ఆటో అనలైజర్, ఐసీయూ గదులు నిర్మించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించి మరికాస్త దృష్టి పెడితే పేదోడికి కార్పొరేట్‌ వైద్యం అందుతుందని వైద్య సిబ్బంది అభిప్రాయపడుతోంది.

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య స్కూల్లోపోలీసెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.రాష్ట్రస్థాయిలో 4,5,6 ర్యాంకులతో పాటు 100లోపు 75 ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు

Body:పోలీసెట్

Conclusion:పోలీసెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.