కరోనాతో దేశమంతా అల్లాడుతుంటే..కరోనా అంటే ఏమిటో తెలియని వారు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని.. దాదాపు 10 నక్కలోళ్ల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా రోడ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. వీరి వద్దకు ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ కరోనా మొదటి, రెండో దశల్లో కూడా.. వీరిలో ఏ ఒక్కరూ కరోనా బారిన పడలేదు. వ్యాపారం చేసేటప్పుడు మాత్రమే మాస్కు ధరిస్తారు. మిగిలిన సమయాల్లో మాస్కు పెట్టుకోకున్నా.. అందరూ ఒకేచోట గుంపులుగా చేరుతారు. తమ ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్లే.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. కరోనా సోకలేదని అంటున్నారు.
ఇదీ చదవండి: Rmp's Rape Attempt : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే అత్యాచారానికి యత్నించాడు..