ETV Bharat / state

నివర్ బీభత్సం: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... - నెల్లూరు నివర్ ఎపెక్ట్

నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి. రహదారులపై భారీగా నీరు ప్రవహిస్తుండటం వల్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
author img

By

Published : Nov 26, 2020, 5:16 PM IST

నివర్ తుపాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఎడతెరపిలేని వర్షాలు, ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు వరి, కూరగాయలు, నిమ్మ, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

నివర్ తుపాను దాటికి ఉదయగిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కొండాపురం మండలంలో మిడత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సీతారాంపురం మండలంలోని మర్రిఊట్ల రిజర్వాయర్ అలుగు పారుతోంది. లింగాల చెరువు, ఆర్లపడియ, కృష్ణంపల్లి చెరువులు నిండుకుండలా మారాయి.

రహదారులు జలమయం

నివర్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రహదారులు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై మనుబోలు, గూడూరు మధ్య నీరు ప్రవహిస్తుండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిపై 5 కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయాయి. కలిగిరి నుంచి సంగం, కావలి, కొండాపురం మార్గాలలో రోడ్లపై వాగులు ప్రవహిస్తుండడంతో రవాణా స్తంభించింది.

నీటితో తొణికిసలాడుతున్న చెరువులు

నెల్లూరు, వెంకటగిరి, గూడూరు, నాయుడుపాలెం, సూళ్లూరుపేటలో భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నీటితో తొణికిసలాడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు డెబ్బ తిన్నాయి. పొలాల్లో వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులకు కలిగిరిలో కూరగాయల మార్కెట్​లోని దుకాణాలు పైకప్పులు ధ్వంసమయ్యాయి. దొరవారి సత్రం మండలంలోని చెరువుకు గండి పడింది. గోతాలకు మట్టి నింపి రైతులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. గిద్దలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్ల మధ్య వర్షం నీరు ప్రవహిస్తోంది.

అధికారుల అప్రమత్తం

తుపాన్‌ ప్రభావంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నెల్లూరు తహసీల్దార్‌ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమాచారం కోసం కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 897 876 2988 కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నారని... ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ఇదీచదవండి

తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.