ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో 'నివర్' ప్రకంపనలు - నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు

తెల్లవారుజాము నుంచి నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు.. ఇప్పటికే పంటలు నాశనమయ్యాయి. వరద నీరు రోడ్లపై పొంగి పొర్లుతోంది. జిల్లాపైన నివర్ తుపాన్ ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి అనిల్ కుమార్, కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి.. తగిన ఏర్పాట్లు చేశారు.

nivar cyclone
నెల్లూరులో నివర్ తుఫాన్ ప్రభావం
author img

By

Published : Nov 25, 2020, 10:03 PM IST

నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచి ఎండతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకే.. జిల్లాలో 50శాతం చెరువులు నిండాయి. ఈ రోజు వానల ధాటికి మిగిలిన చెరువుల్లోనూ నీరు చేరింది. నాయుడుపేట, సూళ్లూరుపేట, కోవూరు, విడవలూరుల్లో వందలాది ఎకరాల్లో వేసిన నారుమళ్లు ఇప్పటికే మునిగిపోయాయి. మరి కొంత భాగంలో నాట్లు వేశారు. నిండుకున్న చెరువుల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

కావలిలో సముద్రం ఉగ్రరూపం

నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలిలో సముద్రపు అలలు 10 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు.. జాలర్లను సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశించారు. పడవలు, వలలను జాగ్రత్త చేసుకోవాల్సిందిగా ముందస్తు సూచనలు చేశారు.

జలమయమైన నెల్లూరు నగరం

తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. కాలువలు, రహదారులపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో.. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. సోమశిల ఎస్.సి. కార్యాలయాన్నీ వరద చుట్టుముట్టింది. నగరంలో ప్రధానమైన జీఎన్​టీ రోడ్డు.. చెరువును తలపిస్తోంది. కింది వంతెనల్లోకి నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.

సోమశిలకు వరద తాకిడి

నెల్లూరు జిల్లాలో 1,750 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. ఈ రోజు వర్షాలకు వాటిలో 80 శాతం నిండాయి. ఇరిగేషన్ ఇంజనీర్లను కలెక్టర్ చక్రధర్ బాబు.. ఆ ప్రాంతాల్లో నియమించారు. ఇసుకబస్తాలు వంటివి ఏర్పాటు చేశారు. సోమశిల జలాశయానికి 8వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ముందు జాగ్రత్తగా 11, 12 గేట్లు ఎత్తి.. నీటిని అధికారులు పెన్నానదిలోకి విడుదల చేశారు. 15వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. 75 టీఎంసీల నీటిని నిలువ ఉంచారు.

సన్నద్ధతపై మంత్రి సమీక్ష

నివర్ తుపాన్ ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల్లూరు ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించారు. చెరువు, వాగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హెచ్చరికలు, సహాయక చర్యలు:

నెల్లూరు జిల్లా కావలి మండలంలోని తుమ్మలపెంట, కొత్తసత్ర తీరంలో జాలర్లకు.. కావలి ఆర్డీవో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో సముద్రంలో అలలు అధిక ఎత్తులో వస్తున్నాయని.. తుపాన్ తీరం దాటే వరకు వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు. వలలు, మర పడవలను.. అలలకు దూరంగా ఉంచుకోవాలని సూచించారు. సముద్రం వద్దకు ఎవ్వరిని రానివ్వకుండా మెరైన్ అధికారులు గస్తీ తిరుగుతున్నారు.

నివర్ ప్రభావం నెల్లూరు జిల్లాలోనూ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంతంలో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పునరావాస కేంద్రాలకు 2వేల మందిని తరలించారు. వారికి భోజనం, వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.

నెల్లూరులో నివర్ తుఫాన్ ప్రభావం

ఇదీ చదవండి:

పెనుతుపానుగా నివర్​- ఈదురుగాలుల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.