నెల్లూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని చిన్న బజార్, పెద్ద పోస్టాఫీస్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా జగన్ కు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాపువీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూజలలో పాల్గొన్నారు.
ఇదీచూడండి.గణనాథుని పూజలో మంత్రి అవంతి శ్రీనివాస్