ఒక వైపు కరోనా... మరో వైపు లాక్ డౌన్... వేటినీ పట్టించుకోవడం లేదు నెల్లూరు జిల్లా ప్రజలు. భౌతిక దూరం పాటించమని.. మాస్కులు ధరించాలనే విషయాన్ని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని అధికారులు అంటున్నారు. నెల్లూరు గ్రామీణ మండలం ములుమూడి గ్రామంలో ఉన్న చెరువులో రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు చేరటంతో ఆ ప్రాంతం మొత్తం తిరునాళ్లను తలపిస్తోంది.
సౌత్ మోపూరు, కొమరపూడి, మొగళ్లపాలెం గ్రామాలతోపాటు, నెల్లూరు నగరం నుంచి కూడా అనేక మంది చేపల కోసం వెళుతున్నారు. వందల మంది ప్రజలు ఒకరిమీద ఒకరు తోసుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. ఎవరికీ మాస్కులు లేవు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితి ప్రమాదకరమని తెలిసినా ప్రజలు మాత్రం చేపల కోసం చెరువు వద్దకు తండోపతండాలుగా వెళ్తుతుండటం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చూడండి : ప్రధాన వార్తలు @ 9 PM