ETV Bharat / state

Nellore Wrestlers Won Medals in National Level: ఆర్థిక సహకారమిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతామంటున్న నెల్లూరు రెజ్లర్లు

Nellore Wrestlers Won Medals in National Level: ఒత్తిడిని దూరం చేయడంతో పాటు ఉద్యోగ సాధనకు చక్కటి మార్గం ఆటలు. అందుకే నెల్లూరుకి చెందిన యువకులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ ప్రతిభను చాటుకుంటున్నారు. కోచ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో కుస్తీ పోటీల్లో సత్తాచాటుతున్నారు. సరైన సదుపాయాలు లేకున్నా జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. వినూత్నంగా సాగుతున్న ఆ మట్టివీరుల కుస్తీ పోటీలను తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవి తెలుసుకోండి.

Nellore_Wrestlers_Won_Medals_in_National_Level

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 8:04 AM IST

Nellore Wrestlers Won Medals in National Level: ఆర్థిక సహకారమిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతామంటున్న నెల్లూరు రెజ్లర్లు

Nellore Wrestlers Won Medals in National Level: అహోరాత్రులు కష్టపడుతూ విజయం సాధించాలనే తపనతో వారంత కుస్తీ సాధన చేస్తున్నారు. ప్రతిభ ఉన్నా సరైన సదుపాయాలు లేక అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నారు. పేదరికం కారణంగా ఈ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకు వెళ్లలేక ఆగిపోతున్నారు. పరిస్థితి గమనించిన కోచ్‌, అకాడమీ వ్యవస్థాపకులు ఈ యువకులను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు.

నెల్లూరుకు చెందిన కుస్తీ వీరులు సాధన చేస్తూ.. ఇంటర్‌, డిగ్రీలు చదువుతున్నారు. వీరందరికి క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉంది. కానీ ఎలా ముందుకెళ్లాలో తెలియని సమయంలో రెజ్లింగ్‌ ఆట ప్రత్యేకతను తెలియజేశాడు కోచ్‌ ప్రేమ్‌కుమార్‌. పైగా ఆటల్లో రాణిస్తే ఉద్యోగాల్లో అవకాశాలు వస్తాయని.. కోచ్‌పై నమ్మకంతో సాధన చేస్తూ ముందుకు సాగారు ఆ యువకులు.

Tennikoit sport: టెన్నికాయిట్‌ క్రీడల్లో జాతీయ స్థాయిలో కీర్తి పతకాలు ఎగురవేస్తున్న.. విజయనగరం అమ్మాయిలు

మొదట్లో శిక్షణ కేంద్రం అందుబాటులో లేక మట్టిలో కుస్తీలు నేర్చుకున్నారు. కానీ వీరి ఆసక్తిని చూసి కోచ్‌ శ్రీవాసులు.. తన శిక్షణ కేంద్రంలో కుస్తీలు పట్టేందుకు అవకాశం కల్పించాడు. ఈ అవకాశంతో ప్రస్తుతం సింహపురి స్పోర్ట్స్ ఆథారిటిలో శిక్షణ పొందుతున్నారు. అయితే ఆసక్తి ఉన్న యువకులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామంటన్నారు రెజ్లింగ్‌ కోచ్‌.

"నేను నెల్లూరు జిల్లాకు రెజ్లింగ్​ కోచ్​గా పని చేస్తున్నాను. ఈ ఆట వల్ల ఉద్యోగ సాధనలో 2శాతం రిజర్వేషన్​ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రతిఒక్కరికి దీనివల్ల ఉద్యోగం, విద్య వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది." -ప్రేమ్‌కుమార్‌, రెజ్లింగ్‌ కోచ్‌

కుస్తీపై యువకులు చూపిస్తున్న ఆసక్తిని గమనించి నాయుడు పేట, వెంకటగిరి పట్టణాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం 60 మందికి పైగా యువకులు ఈ స్పోర్ట్స్‌ ఆథారిటీలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో 20 మందికి పైగా రెజ్లర్లు పథకాలను సాధించారు. చదువుతో పాటు శారీరక దృఢత్వాన్నిపెంచుకునేందుకు ఆటలు ఆడుతోన్నట్లు చెబుతున్నారు ఈ కుస్తీవీరులు.

Asia Games 2023 : ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు!.. ఏకంగా పాక్​ కెప్టెన్సీ బాధ్యతలు.. ఎవరబ్బా ఈ అక్రమ్​?

"మాది మారుముల గ్రామం నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి రెజ్లింగ్​ ఆటలో శిక్షణ తీసుకుంటున్నాను. నేను 2015 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐదు జాతీయ క్రీడలలో పాల్గొన్నాను. వాటిలో పతకాలు సాధించాను." -సి.హెచ్ హరి, కుస్తీ క్రీడాకారుడు

"నేను మొదటి జాతీయ స్థాయి రెజ్లింగ్​ పోటీ దిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ స్టేడియంలో ఆడాను. ముంబాయ్​, ఉత్తర్​ ప్రదేశ్​లో కూడా జాతీయ స్థాయిలో ఆడాను." -పి.వినీత్‌, కుస్తీ క్రీడాకారుడు

Tamilnadu Man Kanyakumari to South Korea Solo Cycle Trip: పర్యావరణ పరిరక్షణ కోసం.. యువకుడి ప్రపంచ యాత్ర

క్రీడల పట్ల చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకోవాలని.. ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం ఆటలు ఆడడం ద్వారా ఒత్తిడి దూరమవుతుందని ఈ యువకులు చెబుతున్నారు. అలాగే స్మార్ట్‌ ఫోన్ల వాడకం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని వాటి నుంచి విముక్తి పొందెందుకు ఆటలు ఆడాలని సూచిస్తున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని.. ఆ ఖర్చుని భరిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీనివాసులు. జాతీయ స్ధాయిలో ఆడటానికి ఆయన సహాయం చేస్తున్న.. అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు మాత్రం రెజ్లర్లు ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు.

Aditya Rocket experiments: రాకెట్‌ ప్రయోగంలో తెలుగు యువకుడి ప్రతిభ.. 32మందికి లీడర్​

"రెజ్లింగ్​కు సంబంధించి మన దగ్గర 30 మంది పిల్లలున్నారు. ఇందులో 20 మంది వరకు రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 15మంది వరకు జాతీయ స్ధాయిలో పాల్గొన్నవారు ఉన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్లాలంటే ఆర్థికంగా కష్టంగా ఉంటుంది. ఆర్థిక స్థోమత లేకపోవటంతో మేము సహాయం చేస్తున్నాము. జాతీయ స్థాయికి ఎంపికైనా వారందరికీ సహాయం చేయాలంటే కష్టంగా ఉంది." -శ్రీనివాసులు, అకాడమీ వ్యవస్థాపకులు

క్రీడల్లో రాణించాలనే తపన ఉన్నా సహకారం అందించేవారు లేక ఆ కుస్తీవీరులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. అయినా కోచ్‌ అందించిన ఉచిత శిక్షణతో పలువురు క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించారు. ఆర్థిక సహకారం తోడైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటుతామంటున్నారు ఆ రెజ్లర్లు.

yuva సైకిల్ తొక్కండి.. ఫిట్​నెస్ పొందండి! సైకిల్​పై దేశాన్ని చుట్టేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.