నెల్లూరు నగరంలోని లే క్యూ కాలనీలో నివాసముంటున్న అరుణాచలం(75).. గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడం లేదు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది సొంత ఖర్చులతో.. వాలంటీర్ రాకేశ్‌ను చెన్నైకి పంపి వృద్ధునికి పింఛన్ అందేలా చేశారు. సచివాలయ సిబ్బంది ఉదారతను స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి: పోలవరానికి రూ.2234.20 కోట్లు.. కేంద్రం వెల్లడి