ETV Bharat / state

అబ్బురపరుస్తున్న నెల్లూరు యువతి కళాఖండం... రావి ఆకులపై స్వాతంత్య్ర యోధులు

author img

By

Published : Jan 27, 2022, 6:26 PM IST

Special painting on republic day: సాధారణంగా చిత్రాలు, పెయింటింగ్‌ను అట్టలు, నల్లబల్లలపై గీస్తారు. కానీ నెల్లూరుకు చెందిన యువతి రావి ఆకులపై కళారూపాలు ఆవిష్కరించింది. 73వ గణంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని... 73రావి ఆకులపై 73మంది సమరయోధుల చిత్రాలను గీసి ఉద్యమ స్ఫూర్తిని చాటింది.

painting on republic day
painting on republic day

Special painting on republic day: సాధారణంగా చిత్రాలు, పెయింటింగ్‌ను అట్టలు, నల్లబల్లలపై గీస్తారు. ఇప్పుడు చాలా మంది సబ్బులు, సుద్దముక్కలు, బియ్యం గింజలపై సూక్ష్మకళాకృతులు రూపొందిస్తున్నారు. నెల్లూరుకు చెందిన యువతి.. రావి ఆకులపై కళారూపాలు ఆవిష్కరించింది. 73వ గణంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 73రావి ఆకులపై 73మంది సమరయోధుల చిత్రాలను గీసి ఉద్యమ స్ఫూర్తిని చాటింది.

నెల్లూరు దర్గామిట్టకు చెందిన సునీల్ కుమార్, చెంచులక్ష్మిల కుమార్తె ఉజ్వల. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనం నుంచి ఆమెకు పెయింటింగ్‌పై మక్కువ. స్వాతంత్య్ర సమర యోధులపై ఉన్న అభిమానాన్ని విభిన్నంగా ప్రదర్శించింది. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 73మంది జాతీయ నాయకుల చిత్రాలను 73రావి ఆకులపై చిత్రీకరించి దేశ భక్తిని చాటింది. ఒక్కో ఆకుపై... ఒక్కో చిత్రం గీసేందుకు సుమారు 7నిమిషాలు పట్టింది. మొత్తం.. 73చిత్రాలను 9గంటల సమయంలో చిత్రీకరించి... భారతదేశ పటం ఆకారంలో అమర్చింది. ప్రస్తుతం ఉజ్వల పెయింటింగ్‌లో శిక్షణ పొందుతోంది. ఆమె గీసిన చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఉజ్వలకు మరింత తోడ్పాటు అందించి... అంతర్జాతీయ చిత్రకారిణిగా తీర్చిదిద్దుతానని ఆర్ట్ అకాడమీ కోచ్ తెలిపారు.

73వ గణంతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 73రావి ఆకులపై 73మంది సమరయోధుల చిత్రాలను వేశాను. ఒక్కో చిత్రం గీసేందుకు సుమారు 7నిమిషాలు పట్టింది. మొత్తం.. చిత్రాలను గీసేందుకు 9గంటల సమయం పట్టింది. ఆ చిత్రాలను భారతదేశ పటం ఆకారంలో అమర్చాను. నా తల్లిదండ్రులు, కోచ్ అమీర్ జాన్​ ప్రోత్సాహంతోనే ఈ చిత్రాలను గీశాను.- ఉజ్వల

అబ్బురపరుస్తున్న నెల్లూరు యువతి కళాఖండం...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: IAS Praveen Prakash sit on knees : సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.