ETV Bharat / state

MLA Kotam: సీఎం మూడు సంతకాలను గుర్తు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఏమిటంటే? - rural mla kotamreddy Sridhar

MLA Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లాలో రూరల్​ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్​ మూడు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ నిధులు మంజూరు కాలేదన్నారు. అసలు జగన్​ అన్నిసార్లు సంతకాలు చేసింది దేనికోసమో చదివేయండి..

MLA Kotamreddy Sridhar Reddy
MLA Kotamreddy Sridhar Reddy
author img

By

Published : May 2, 2023, 2:59 PM IST

సీఎం మూడు సంతకాలను గుర్తు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy Sridhar Reddy : నెల్లూరు జిల్లా రూరల్ సమస్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి మరోమారు తన గళాన్ని వినిపించారు. ఓ కమ్యూనిటీ హాల్​ నిర్మాణం కోసం సీఎం జగన్ మూడు సంతకాలు చేశారని.. అయినా ఇప్పటి వరకూ నిధులు మంజూరు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్​ పెట్టిన సంతకాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి మాట్లాడుతూ.. "క్రిస్టియన్​ కమ్యూనిటీ హాల్​ నిర్మాణం కోసం గత నాలుగు సంవత్సరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్​ మూడు సార్లు సంతకాలు పెట్టినా అడుగు ముందుకు పడలేదు. అప్పటి నుంచి నిధులు మంజూరు కాలేదు. కమ్యూనిటీ హాల్​ నిర్మాణం పూర్తైతే క్రిస్టియన్​ సోదరుల పెళ్లిళ్లు, జన్మదిన వేడుకలు, ఇతరత్రా సామాజిక కార్యక్రమాలు జరుపుకోవడానికి తక్కువ ఖర్చులో ఈ కమ్యూనిటీ హాల్​ అందుబాటులో ఉంటుంది. ఈ ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిని కలిసి సంతకం పెట్టించాను.

అక్కడితో ఆగకుండా అప్పటి కలెక్టర్​ను కలిసి గాంధీనగర్​లో 150 అంకణాల స్థలాన్ని(1 అంకణం=72 చదరపు అడుగులు) కేటాయించాం. మొదటిసారి 2019 జూన్​ 10వ తేదీన కమ్యూనిటీ హాల్​ కోసం ముఖ్యమంత్రి జగన్​ తొలి సంతకం చేశారు. 2021 ఫిబ్రవరి 3వ తేదీన రెండో సంతకం పెట్టారు. ఆ తర్వాత 2022 జులై 27వ తేదీన ముచ్చటగా మూడో సంతకం పెట్టారు. మూడు సంతకాలు పెట్టినా కూడా ఈనాటికి అమలు కాలేదు. ఈ నాలుగు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి కాలేదు. ఈ సమస్య ఈ నెల 18వ తారీఖు లోపు పరిష్కారం కాకపోతే ఆ తర్వాత నుంచి గ్రామీణ, నియోజకవర్గంలో ఉన్న ప్రతీ చర్చి నుంచి ఒక్కో ఇటుకను తీసుకొచ్చి గాంధీ నగర్​లో కమ్యూనిటీ హాల్​ కోసం కేటాయించిన స్థలంలో పేర్చుతాము" అని కోటంరెడ్డి వ్యాఖ్యనించారు.

"ఈ కమ్యూనిటీ హాల్​ కోసం అంతా కలిపి ఆరు కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటివరకు అడుగుముందుకు పడలేదు. అనుమతులు, నిధులు మంజూరు కాలేదు. ఈ నెల 18 తర్వాత క్రిస్టియన్​ పెద్దలను కలిసి నియోజకవర్గంలోని ప్రతి చర్చి నుంచి ఒక్కో ఇటుక తీసుకొచ్చి గాంధీనగర్​లో పేర్చుతాము" -కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే

మరోవైపు తనపై విమర్శలు చేసే అధికార పార్టీ నాయకులకు గట్టి కౌంటర్​ ఇచ్చారు. తన మాటలను విమర్శలుగా తీసుకోవద్దని.. సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అనే మంత్రులు, ఇన్​ఛార్జులు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని కోరారు. నిధులు మంజూరు చేయించండి అని సవాల్​ విసిరారు. అధికారానికి దూరమైనా.. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.