నెల్లూరు జీజీహెచ్, నారాయణ కొవిడ్ కేంద్రాలను మంత్రులు మేకపాటి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు..ఆస్పత్రిలో పడకల వివరాలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ అందుబాటు తదితర విషయాలపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ రోగుల నుంచి వసూళు చేస్తున్న అధిక బిల్లులపై పలు అపోహలు ఉన్నాయన్నారు. బిల్లుల విషయంలో పారదర్శకత అవసరమన్నారు. ఆ మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో తారతమ్యం లేకుండా చూసుకోవాలన్నారు.
ఇదీచదవండి
నెల్లూరు, రాయలసీమ ఆస్పత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్ నిల్వలు: కృష్ణబాబు