NELLORE RICE MILLER ASSOCIATION MEMBERS : తమకు రావల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని.. నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మూడేళ్ల నుంచి సుమారు రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు... ప్రభుత్వం నుంచి రావాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వీసు ఛార్జీలు, ట్రాన్స్పోర్టు, మిల్లింగ్ ఛార్జీలు, స్టోరేజ్ , డ్రైయింగ్, సార్టెక్స్, పోర్టిఫైడ్ మిక్సింగ్, గన్నీ యూసేజ్ ఛార్జీల రూపంలో రైస్ మిల్లర్లకు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: