ETV Bharat / state

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు - నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.ప్రభాకర్‌పై వేటు పడింది. ఈ విషయమై జిల్లా యంత్రాంగం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ శనివారం పూర్తయింది.

నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు

author img

By

Published : Jun 6, 2021, 6:44 AM IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.ప్రభాకర్‌పై వేటు పడింది. ఈ విషయమై జిల్లా యంత్రాంగం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ శనివారం పూర్తయింది. డీఎంఈ వేసిన ప్రత్యేక కమిటీ విచారణ శుక్రవారం పూర్తి చేసిన విషయం విదితమే. ఆయా కమిటీల విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాయి.

దీంతో సూపరింటెండెంట్‌ను కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ జనరల్‌ సర్జరీ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులో నియమించారు. ఆయన స్థానంలో నెల్లూరు జీజీహెచ్‌లో సైక్రియాట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాధాకృష్ణరాజును నియమించారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ ఆయన ఇక్కడ సూపరింటెండెంట్‌గా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి:

యెమెన్​లో క్షిపణి దాడి- 17 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.