ETV Bharat / state

Suspend: నెల్లూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్‌ వేటు - వైద్యవిద్యార్థిని వేధింపుల కేసులో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెం ప్రభాకర్ సస్పెండ్

నెల్లూరు జీజీహెచ్​లో వైద్యవిద్యార్థినిపై వేధింపుల కేసులో.. మాజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్​ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఆయనపై చర్యలు చేపట్టింది.

nellore former superintendent prabakar suspended in sexual harrasment case
నెల్లూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌పై సస్పెన్షన్‌ వేటు
author img

By

Published : Jun 7, 2021, 7:56 PM IST

Updated : Jun 7, 2021, 8:22 PM IST

నెల్లూరు జీజీహెచ్​లో జరిగిన వైద్యవిద్యార్థినిపై వేధింపుల కేసులో.. ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభాకర్ ​సస్పెండయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికల సిఫార్సుల మేరకు.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది నెలల క్రితం వేధింపుల ఘటన జరిగినట్లుగా.. ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సదరు విద్యార్ధిని చెప్పిన వివరాల ప్రకారం గోప్యంగా ఉన్న ఈ సమాచారం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో విచారణ జరిపినట్టు తెలిపింది. అయితే జూన్ 5న ఆయనపై తాత్కాలిక చర్యలు తీసుకుంటూ.. కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేసింది.

దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ఇచ్చిన నివేదిక మేరకు.. ప్రభాకర్ పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేసుపై తదుపరి విచారణ జరుగుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. విచారణ సమయంలో ఆయన నెల్లూరు విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొంది.

సంబంధిత కథనాలు:

Last Updated : Jun 7, 2021, 8:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.