నెల్లూరు జిల్లా సీతారామపురం అటవీప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడేందుకు సిద్ధంగా ఉంచిన ఓ నాటు తుపాకీ, 16 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతారామపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు ఎస్సై రవీంద్ర నాయక్‌కు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. పోలీసుల రాకను గమనించిన వేటగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి ..