నీరు - చెట్టు కార్యక్రమ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నెల్లూరులో గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రెండున్నరేళ్లగా బిల్లులు రాక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో దాదాపు వంద కోట్ల రూపాయల బిల్లులు ఆగిపోయాయని, అప్పులు తెచ్చి పనులు చేశామని వాటికి వడ్డీలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే బిల్లులు చెల్లించకుంటే తామంతా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడతామన్నారు.
ఇదీ చదవండి: