నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో నృసింహ స్వామి జయంతి వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి బంగారు గరుడ వాహన సేవ నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కర్పూర హారతులు ఇచ్చారు.
ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. బ్రహ్మోత్సవాలు సాంప్రదాయాల ప్రకారం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాహన సేవలను తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. నేడు ఉత్సవ మూర్తులకు కల్యాణోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సహాయ సంచాలకులు వెంకట సుబ్బయ్య తెలిపారు.
ఇదీ చదవండి: