Sri Damodaram Sanjeevaiah Thermal Power: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 300 రోజులకు చేరింది. ఏపీ జెన్కో గేటు వద్ద కార్మికులు నిరసన తెలిపారు. జెన్కో ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున గేటు వద్ద బైఠాయించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవర్ జేఏసీ ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 27వ తేదీన.. జెన్కో మూడవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారని, మొత్తం మూడు యూనిట్లను కలిపి ప్రైవేటు టెండర్లు పిలిచి.. అదానికి అంకితం చేయడం సిగ్గుచేటని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. టెండర్లను పిలిచి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే.. ఏపీ జెన్కోను ముట్టడించేందుకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఏపీ జెన్కో మేనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మధ్య చీలికలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఇవీ చదవండి: