రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటం చరిత్రాత్మకమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణకు సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారని కొనియాడారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన... అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి