రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందని.. మొదటి విడతలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 1.90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు. అన్ని మౌలిక వసతులతో కాలనీల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంటే.. ఓర్వలేక తెదేపా లేనిపోని విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: పల్లెల్లో విస్తరిస్తున్న కరోనా... నియంత్రణకు అధికారుల చర్యలు