ETV Bharat / state

Funds Misuse In ApparaoPalem: అప్పారావుపాలెంలో నిధులు స్వాహా.. వైఎస్సార్సీపీలో రెండు వర్గాల ఘర్షణ - నెల్లూరు జిల్లా రాజకీయ వార్తలు

Funds Misuse In ApparaoPalem: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద వైసీపీలోని ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పంట కాల్వ పనులు చేయకుండానే గుత్తేదారులు బిల్లులు స్వాహా చేశారని వైసీపీలోని ఓ వర్గంవారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అధికారులు విచారిస్తుండగానే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు బిల్లులు పెట్టుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 7, 2023, 9:00 AM IST

అప్పారావుపాలెంలో నిధులు స్వాహా..వైఎస్సార్సీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Funds Misuse In ApparaoPalem : వైఎస్సార్సీపీ బలంగా ఉందని చెప్పుకునే నెల్లూరు జిల్లాలో పలు చోట్ల విభేదాలు మొదలైయ్యాయి. మండలాల్లో గ్రూపులు ఏర్పడ్డాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ తరచూ విభేదాలు బయటకు వస్తున్నాయి. ఆత్మకూరు మండలం అప్పారావు పాలెంలో శనివారం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని వైఎస్సార్సీపీలోని రెండో వర్గం ఆరోపణలతో రోడ్డుకెక్కారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం పంచాయితీలో ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారంటూ వైఎస్సార్సీపీలో అసమ్మతి వర్గం ఆరోపణ చేసింది. పంట కాలువ పనుల్లో కనీస నాణ్యత పాటించడం లేదని, పూడిక సరిగా తీయడం లేదని, చేసిన పనులే తిరిగి చేస్తూ నిధులు కాజేస్తున్నారనీ వైఎస్సార్సీలోని వర్గం ఆరోపణలు చేస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసేందుకు వచ్చిన అధికారులు ఎదుట వైఎస్సార్సీపీలోని రెండు వర్గాలు బాహాబాహీగా తలపడ్డారు.

"వర్షాల కారణంగా రోడ్లు పాడైపోయాయి. వాటిని బాగు చేయకుండా చేసినట్టుగా కోటీ 50 లక్షలు బిల్లులు పెట్టుకున్నారు. స్పందనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. విచారణ కోసం అధికారులు వస్తే జడ్పీటీసీ భర్త పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు ఎస్సీ వాళ్లను తీసుకు వచ్చి గొడవకు దిగారు."- స్థానికుడు

ఫిర్యాదు చేసిన వర్గంపై జడ్పీటీసీ భర్త పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు వర్గీల దాడికి యత్నం చేశారు. ఇరిగేషన్ పనుల్లో జడ్పీటీసీ భర్త పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని కలెక్టర్​కి ఫిర్యాదు చేశారు. ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాలువ పూడిక తీత పనులు చేయకుండానే రెండు సార్లు చేసినట్లు బిల్లులు చేసుకున్నారని ఫిర్యాదుపై అధికారులు విచారణ చేస్తున్నారు.

అంతే కాకుండా రోడ్డు పనులకు నాసిరకం మట్టి తోలడంతో వర్షాలు వచ్చినప్పుడు పొలాలకు వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఇరిగేషన్ పనులు చేయకుండానే రెండు సార్లు చేసినట్లు బిల్లులు పెట్టుకుని బినామీ పేర్లతో జడ్పీటీసీ భర్త పెమ్మసాని కోట్ల రూపాయల స్వాహా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

"జడ్పీటీసీ భర్త పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు ఎస్సీ వాళ్లను ఇద్దరిని తీసుకువస్తారు. ప్రతీసారీ వారిని ముందు ఉంచుకోని ఇప్పటికి మాపై మూడోసారి కేసు పెట్టడం. వాళ్లుకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్లు రైతులే కాదు. మేము వాళ్లుకు దూరంగా ఉన్నా మమల్నీ ఆపి గొడవ పెట్టుకోని కేసు పెట్టడానికి వెళ్లారు."- స్థానికుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.