ETV Bharat / state

'వచ్చే ఏడాదిలో సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణం పూర్తి'

నెల్లూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని... మంత్రులు అనిల్​ కుమార్​ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి​ వివరించారు. వచ్చే ఏడాదిలోనే సంగం, పెన్నా బ్యారేజీలను పూర్తి చేస్తామని వెల్లడించారు.

Ministers inspected the sangam Barrage
సంగం ప్రాజెెక్టును పరిశీలిస్తున్న నేతలు
author img

By

Published : Dec 26, 2019, 5:37 PM IST

మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ ప్రసంగం

నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను ఐటీ, ఇరిగేషన్ శాఖ మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరిశీంచారు.

ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ... సంగం బ్యారేజి నిర్మాణ పనులపై గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు. అతి త్వరలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు. టూరిజం కేంద్రంగానూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రి అనిల్​కుమార్ యాదవ్ మాట్లాడుతూ... మే లోపు పెన్నా బ్యారేజీ పనులను... అక్టోబర్​లోపు సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తిచేసి ముఖ్యమంత్రి జగన్​ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సోమశిల హైలెవల్ కెనాల్ పనులనూ వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:మతిస్థిమితం లేని జంటకు పెళ్లి.. సైకిల్​పై ఊరేగింపు

Intro:Ap_nlr_11_26_mantrula paryatana_avb_ap10061Body:యాంకర్ వాయిస్: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇరిగేషన్ శాఖ మాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ పరిశీంచారు. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంగం బ్యారేజి నిర్మాణం పనులు గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని
అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి సాగు, తాగు నీరు అందిస్తామని, అలాగే టూరిజం కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులను సెప్టెంబర్ అక్టోబర్ లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ 1, ఫేస్ 2 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బ్యారేజి నిర్మాణ పనులకు నిధులు సక్రమంగా కేటాయించనందున నిర్మాణం నత్తనడకన సాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయిందని తెలిపారు.Conclusion:కిట్ నెం‌ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.