నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి విజయం సాధించిన మేకపాటి గౌతంరెడ్డి... కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఎంఎస్సీ పూర్తి చేసిన గౌతం రెడ్డి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి.... ముఖ్యమంత్రి జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ పెట్టకముందు నుంచే జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన వారిలో గౌతం రెడ్డి ఒకరు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి
నియోజకవర్గం: ఆత్మకూరు
వయస్సు: 45
విద్యార్హత: ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్)
రాజకీయ అనుభవం: రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు
నెల్లూరు నగరం నుంచి గెలుపొందిన పి. అనిల్ కుమార్ జగన్ కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. 2008లో నెల్లూరు కార్పొరేటర్గా గెలుపొందిన అనిల్.... 2014లో తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2019 ఎన్నిక్లలోనూ విజయం సాధించి... మంత్రివర్గంలో చోటు ఖరారు చేసుకున్నారు.
అనిల్‌కుమార్ యాదవ్
నియోజకవర్గం: నెల్లూరు సిటీ
వయస్సు: 39
విద్యార్హత: బీడీఎస్
రాజకీయ అనుభవం: ఒకసారి కార్పొరేటర్‌గా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు
ఇదీ చదవండి