నెల్లూరు జిల్లాలో మంత్రులు బాలినేని శ్రీనివాసరావు, మేకపాటి గౌతమ్ రెడ్డి(Ministers Balineni Srinivasa Rao and Mekapati Gautam Reddy visited Nellore district) పర్యటించారు. సోమశిల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని పరిశీలించారు. కొట్టుకుపోయిన గుడిలోని విగ్రహాల చరిత్ర, ప్రస్తుత పరిస్థితిని పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ చరిత్ర చెక్కుచెదరకుండా విగ్రహాలను తిరిగి ప్రతిష్టించి పునర్వైభవం తీసుకొస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. రూ.6 కోట్లు అవుతుందని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేశారని..ఇక ముందు ఎలాంటి వరద వచ్చినా తట్టుకునేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
ఇదీ చదవండి: Nellore floods : వరద కట్టిన కన్నీరు.. మంత్రి కాళ్ల మీద పడ్డ మహిళలు..!