ETV Bharat / state

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినిమా చూపిస్తాం: మంత్రి కేటీఆర్ - ap latest news

KTR challenges BJP leaders: సిరిసిల్ల విద్యుత్‌ సహకార సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెస్​ ఫలితాలు బీజేపీ నేతలకు ట్రైలర్​ మాత్రమేనని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధులే ఎక్కువని చెప్పారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు.

ktr challenge
మంత్రి కేటీఆర్
author img

By

Published : Jan 10, 2023, 9:50 PM IST

KTR challenges BJP leaders: తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు వెళ్లాయని.. కేంద్రం తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్​ చేశారు. సిరిసిల్ల విద్యుత్‌ సహకార సంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుజరాత్​లో దోచుకున్న సంపదను బీజేపీ నేతలు సెస్ ఎన్నికల్లో ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. రూ.4.5 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని విమర్శించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సెస్​ ఎన్నికలు ట్రైలర్​ మాత్రమేనని.. అసలు సినిమా 2023లో చూపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి దమ్ముంటే అనవసర విమర్శలు ఆపి.. మంచి పనులు చేయాలని హితవు పలికారు.

ఈ క్రమంలోనే మోదీ దేవుడు అనే బీజేపీ నేతల వ్యాఖ్యలపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచితే దేవుడు అవుతాడా అని ప్రశ్నించారు. బండి సంజయ్​, గుజరాత్​ ప్రజలకు మోదీ దేవుడు కావొచ్చని వ్యాఖ్యానించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు కొట్లాట జరుగుతుందన్న కేటీఆర్​.. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గట్టు పంచాయితే తెంపలేని మోదీ.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా అని ఎద్దేవా చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినిమా చూపిస్తాం: మంత్రి కేటీఆర్

రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం తెలంగాణకు రూ.2 లక్షల కోట్లు ఇచ్చింది. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రాల గొడవ పరిష్కరించని మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపారా? - మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.