AP Minister Kakani Govardhan Reddy latest comments: నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల భవనాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో రూ. 10వేల 778 రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అందులో రూ.3వేల పై చిలుకు శాశ్వత భవనాలున్నాయని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలో రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల భవనాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు సలహాలు సూచనలు సేవలు అందించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 వేల పైచిలుకు శాశ్వత రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. 4 వేల రైసు రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
అనంతరం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పంటలను నాశనం చేసే పురుగు మందులు, ఎరువుల నాణ్యత ప్రమాణాలను పరీక్షించే ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు గౌరవ అతిథులు, అధికారుల సమక్షంలో జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవన సేంద్రియ ఎరువుల నాణ్యతను నిర్ధారణ చేసే ప్రయోగశాలను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు.
''రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల భవనం ఏర్పాటు కోసం మొదటగా కోటి నలభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేసి భవనాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత అవసరమైన రిక్రూట్‌మెంట్ కోసం మరో కోటి రూపాయలను మంజూరు చేసింది. ఈరోజు గౌరవ అతిథుల, అధికారుల సమక్షంలో ఈ భవనాన్ని ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైన విధానాలను అమలు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల కోసం ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.''-కాకాణి గోవర్థన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి