ETV Bharat / state

Gowtham Reddy No More: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. రేపు అంత్యక్రియలు - mekapati news

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు

author img

By

Published : Feb 21, 2022, 9:12 AM IST

Updated : Feb 22, 2022, 4:22 AM IST

09:11 February 21

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(49) కన్నుమూత

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్‌ (సీపీఆర్‌) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్‌రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్‌రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్‌ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

...

ఉదయం 11.40 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. మంత్రి మృతి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నేతను కోల్పోవడం చాలా విషాదకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

రెండుసార్లు కొవిడ్‌ నుంచి బయటపడి...
గౌతమ్‌రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. తండ్రిబాటలోనే రాజకీయ అరంగేట్రం చేసి 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. వివాదరహితుడిగా.. పరిశ్రమల, ఐటీ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా దుబాయ్‌లో పర్యటించి, ఆదివారమే నగరానికి తిరిగొచ్చారు. గౌతమ్‌రెడ్డి రెండుసార్లు కొవిడ్‌ బారిన పడ్డారు. మొదటి వేవ్‌లోనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో రెండు, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కోలుకున్నారు. గత నెల 22న మరోసారి (కరోనా మూడో వేవ్‌లో) కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. గుండె ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపించిందా అనే అంశాన్ని కూడా వైద్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల గౌతమ్‌రెడ్డి బాగా శ్రద్ధ చూపుతుంటారు. నిత్యం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తుంటారని సన్నిహితులు తెలిపారు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన హఠాన్మరణాన్ని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చికిత్సకు స్పందించకపోవడంతో యాంజియోగ్రామ్‌, ఇతర పరీక్షలు చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. దీంతో గుండె కవాటాల్లో ఏవైనా పూడికలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా చెప్పడం కష్టమన్నారు.

...

హుటాహుటిన అపోలోకు తెలంగాణ మంత్రులు
గౌతమ్‌రెడ్డి మృతి వార్త తెలియగానే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, వైతెపా అధ్యక్షురాలు షర్మిల, సీఎం జగన్‌ తల్లి విజయమ్మ, కేవీపీ రామచంద్రరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.

...

గౌతమ్‌రెడ్డి మృతికి ప్రభుత్వం విచారం
పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయన మృతికి నివాళిగా సోమ, మంగళవారాల్ని సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాల్ని అవనతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో జరుగుతాయని వెల్లడించారు. అమెరికాలో ఉన్న గౌతమ్‌ కుమారుడు అర్జున్‌రెడ్డి మంగళవారం రాత్రికి చేరుకొనే అవకాశాలున్నాయి. మృతదేహాన్ని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌కి హెలికాప్టర్‌లో తరలిస్తారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లి, ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

...

నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది

సోమవారం ఉదయం 7.20 సమయంలో నిద్ర లేచి బయటకు వచ్చిన ఆయన సోఫాలో కూర్చున్నారు. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారు. గట్టిగా పిలవడంతో కింద ఉన్న నేను పరుగెత్తుకుంటూ పైకి వచ్చాను. అప్పటికే ఆయన కింద పడిపోయి ఉన్నారు. కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తాను. మంచినీళ్లు అడిగారు. తెచ్చి ఇచ్చినా తాగలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు లిఫ్ట్‌ వద్దకు తీసుకొచ్చేసరికి నాలుక మడతపడింది. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. కారులో వచ్చేటప్పుడు శ్వాస ఉంది కానీ మాట్లాడలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఉదయం 8 గంటలకు జిమ్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు తిరిగి వచ్చాం. మాకు దేవుడులాంటి మా సార్‌.. దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నాం. 2003 నుంచి ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నన్ను ఏనాడూ పనివాడిగా చూడలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ అభయమిచ్చేవారు. - నాగేశ్వరరావు, గౌతమ్‌రెడ్డి డ్రైవర్‌, ప్రత్యక్షసాక్షి

ప్రముఖుల సంతాపం..

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గౌతమ్‌రెడ్డి సౌమ్యులు, సంస్కారవంతులని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు అని అన్నారు. గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి ఆ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు. గౌతమ్‌రెడ్డి నేనంటే ఎంతో అభిమానం చూపేవారన్న వెంకయ్యనాయుడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి అని.. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనని జగన్​ అన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాసేపట్లో సీఎం జగన్​ హైదరాబాద్‌ బయల్దేరనున్నారు.

మంత్రి మేకపాటి మృతి పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి మృతి తనను కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరమన్న చంద్రబాబు.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గౌతంరెడ్డి మృతి పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త అమితంగా బాధించిందన్నారు. చిన్న వయస్సులోనే గౌతంరెడ్డి మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్న పెద్దిరెడ్డి... నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. గౌతంరెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించిందన్నారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పెద్దిరెడ్డి... గౌతమ్ రెడ్డి మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు.

గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని లోకేశ్‌ అన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడం విచార‌క‌రమన్నారు. విన‌యం, విధేయ‌త‌లు గౌతంరెడ్డి చిరునామా అని లోకేశ్‌ తెలిపారు. ఐదు ప‌దుల వ‌య‌స్సులోనే ఎంతో హుందా గ‌ల వ్యక్తి గౌతంరెడ్డి అని అన్నారు.

ఇదీ చదవండి: "నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు!

Last Updated : Feb 22, 2022, 4:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.