కరోనా సమయంలో సోనూ సూద్ అందించిన సేవలు ఆదర్శమని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైద్యశాలలో రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను దివ్యాంగురాలు నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో సోనూసూద్‌తో మాట్లాడి ఆత్మకూరుకు ఆహ్వానించారు. మెట్ట ప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించినందుకు అభినందనలు తెలిపారు.
దివ్యాంగురాలు నాగలక్ష్మి తన తరఫున... సోనూసూద్ ఫౌండేషన్‌కు రూ.25వేలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25వేలు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. సోనూసూద్ సేవలపై యూట్యూబ్‌లో తాను చేసిన వీడియోకు రూ.50 వేలు వచ్చాయని, ఆ నగదును వీటికి అందిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి గౌతమ్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు.. నాగలక్ష్మిని ప్రత్యేకంగా సన్మానించారు. దివ్యాంగురాలైనా తనది పెద్దమనసని కొనియాడారు. గతంలో ఆమె తన 5 నెలల పింఛను రూ.15వేలను సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమానికి నాగలక్ష్మిని సోనూసూద్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇదీ చూడండి:
schools reopen: ఆగస్టు 16 నుంచి బడులు... అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం!