కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ నిల్వలపై జిల్లా పరిషత్ కార్యాలయంలో.. కలెక్టర్ చక్రధరబాబు, వైద్యులు, నోడల్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో.. సాయంత్రంలోగా ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నెల్లూరుకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెయ్యి రెమిడెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ లేక కరోనా రోగుల అవస్థలు..బయట నుంచి సిలిండర్లు కొనుగోలు