నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని కొవిడ్ సెంటర్ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డులను పరిశీలించి, బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులను పరామర్శించి, వైద్యశాలలో అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తగినన్ని పడకలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: జగన్