కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాతలు... వాలంటీర్ల ద్వారా సరకులను పంపిణీ చేయాలని తాను సూచిస్తే... దానిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. పదిమందికి మంచి చేస్తున్నా చూడలేని తెలుగుదేశం పార్టీ నాయకులు డూప్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ దగ్గర రెడ్‌జోన్‌లో మంత్రి పర్యటించారు.
ఇదీ చదవండి
తెదేపా నేతలవి డూప్ రాజకీయాలు: మంత్రి అనిల్ - nellore district latest news
తెదేపా నేతలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా దాతలు సరకులను పంపిణీ చేయాలన్న తన మాటలను తెదేపా రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు చూడలేరని ఆయన విమర్శించారు.