కందలేరు జలాశయానికి సంబంధించి కొంతమంది కావాలని పుకార్లను పుట్టిస్తున్నారని వాటిని నమ్మొద్దని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జలాశయానికి సంబంధించి పుకార్లు పుట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కందలేరు డ్యామ్ కట్ట తెగిపోతుందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు స్థానికులను కోరారు. అవన్నీ పుకార్లని అధికారులు తెలిపారు. కట్ట తెగిపోతుందనే భయంతో కడలేరుకు దిగువన ఉన్న గ్రామస్థులు.. పొదలకూరుకు చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాలకు వెళ్లి స్థానికులకు ధైర్యం చెబుతూ.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఇవీ చూడండి...