నెల్లూరు టూరిజం హోటల్లో దాడికి గురైన మహిళా ఉద్యోగి దివ్యాంగురాలైన ఉషారాణిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. నగరంలోని కొండాయపాలెం గేటు వద్దనున్న ఉషారాణి నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలిపై దాడి ఘటన బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు: మోదీ