నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రథోత్సవం కనులు పండువగా జరిగింది. శ్రీదేవి భూదేవితో రంగనాథుడిని రథంలో నగరంలో ఊరేగించారు. రాష్ట్రమంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరై రథాన్ని లాగారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: నెల్లూరులో 'హోలికా దహన్' కార్యక్రమం