నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రైల్వే పనులు చేపడుతున్న వలస కూలీలు లాక్డౌన్ కారణంగా ఉండిపోయారు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గంలోని రైల్వే రహదారి నిర్మాణం కోసం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల వారు 50 మంది... శ్రీకాకుళం జిల్లాకు అప్పారావుపాలెంలో పనులు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడం మరికొందరు కరోనా సోకుతుందని అపోహతో తమ సొంత ప్రాంతాలకు తరలించాలని ఆత్మకూరు ఆర్డివోకు విన్నవించారు.
స్పందించిన ఆర్డీవో ఉమాదేవి సమస్యను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచన మేరకు ఆర్డీవో పలువురు వలస కార్మికులు రైల్వే పనులు చేపట్టే విధంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. దానికి సదురు కూలీలు ఆర్డీవో మాటకు సమ్మతించి పనులు చేసేందుకు అంగీకరించారు. పనులు లేని మిగిలిన కార్మికులకు వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న వలస కార్మికులకు మాస్కులు, పండ్లను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: