ETV Bharat / state

జనతా కర్ఫ్యూకు సపోర్టు.. ఆదివారం జరగాల్సిన పెళ్లి వాయిదా - నందవరంలో జనతా కర్ఫ్యూ కోసం వెళ్లి వాయిదా

కరోనా వైరస్​ వ్యాప్తి విస్తరణను అరికట్టడంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు ఓ ముస్లిం కుటుంబం మద్దతు తెలిపింది. ఆదివారం జరగాల్సిన పెళ్లిని సోమవారానికి వాయిదా వేసుకుంది.

Marriage postponed for Janata curfew at nanadavarm in nellore district

author img

By

Published : Mar 21, 2020, 11:55 PM IST

జనతా కర్ఫ్యూకు సపోర్టు.. ఆదివారం జరగాల్సిన పెళ్లి వాయిదా

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన పెళ్లి ఆదివారం జరగాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కారోనా వైరస్ నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబ సభ్యులు ఆదివారం జరగాల్సిన వివాహాన్ని సోమవారానికి వాయిదా వేసుకున్నారు. శనివారం విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కుటుంబసభ్యులు పెళ్లిని వాయిదా వేసుకోవడంతో స్థానికులంతా పెళ్ళికొడుకు కరీముల్లాకు, కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో నలుగురికి కరోనా లక్షణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.