నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గేదెను ఢీకొట్టటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు మర్రిపాడు మండలం రాజుపాళెం గ్రామనికి చెందిన తుమ్మిశెట్టి పెంచిలయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...