నెల్లూరు నగరంలో మరో తొమ్మిది రోజులు పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రకటించారు. ఆదివారంతో లాక్డౌన్ ముగియాల్సి ఉండగా... సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి.
సింగపూర్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గరికపాటి ప్రవచనాలు