నెల్లూరు నగరంలో కరోనా విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ నిబంధనలను అధికారులు పొడిగించారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 15వ తేదీ వరకు నగరంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే 8వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండగా, దానిని మరోసారి పొడిగించారు.
ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లాక్ డౌన్ కు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. కరోనా తీవ్రత అధికమవుతుండటంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'