ETV Bharat / state

Theft In Nellore Court: "కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి"

Theft In Court: నెల్లూరు న్యాయస్థానంలో ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలు చోరీకి గురకావటంపై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయం కావడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

'కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి'

author img

By

Published : Apr 16, 2022, 3:58 PM IST

Updated : Apr 17, 2022, 4:12 AM IST

Theft In Court: నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదుల నిరసన తెలిపారు. సాక్షాత్తూ కోర్టులోనే చోరీ జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన తీరుపైనా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయం కావడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగల బారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

"ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అనామక దొంగలను కాదు.. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలి. కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి? ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం." - న్యాయవాదులు

నిందితుల బెయిలు రద్దుచేయాలి

మంత్రి కాకాణిపై నమోదైన కేసులో.. కొన్ని పరికరాలు, వస్తువులను పోలీసులు సీజ్‌ చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయి. దీనిపై అనుమానాలున్నాయి. ఇది సామాన్య దొంగలు చేసినది కాదు. చోరీ జరిగిన ప్రాంతం పరిశీలిస్తే న్యాయవాదులమైన మాకు అర్థమవుతోంది. నిందితులను రక్షించేందుకే ఇలా చేశారు. నిందితులకు బెయిలు రద్దు చేయాలి.- సి.హరినారాయణ, న్యాయవాది

పోలీసులపై నమ్మకం లేదు

కోర్టులో జరిగిన దొంగతనంలో అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం లేదు. సమగ్ర విచారణ చేయకుండానే.. ఇద్దరు దొంగలను ఇరికించి పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం, పోలీసులపై నమ్మకం లేదు. కోర్టు సుమోటోగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. - షేక్‌ అన్వర్‌బాషా, న్యాయవాది

మంత్రి పదవి పోతుందనే...

ప్రభుత్వమే ఇలాంటి దొంగతనాలకు పాల్పడటం సిగ్గుచేటు. మంత్రికి సంబంధించిన కేసు పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? కేసు నిరూపణ జరిగి.. శిక్ష పడితే మంత్రి పదవి పోతుందనే కాకాణి చేయించి ఉంటారు. రాజ్యాంగంపై, వ్యవస్థపై దాడిచేసి మళ్లీ అధికారంలోకి రావాలని సీఎం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. - గీతావాణి, న్యాయవాది

కోర్టులో దొంగతనం దురదృష్టకరం

ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన కోర్టులో దొంగతనం జరగడం దురదృష్టకరం. దీనిపై కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ కొనసాగుతోంది. అసలైన నిందితులను పట్టుకుని శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడాలి.- ఆర్‌.రోజారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

ఏం జరిగిందంటే..: నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈనెల 13న అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన వాటిని కాలువలో పడేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య నడుస్తున్న ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

ఇదీ చదవండి: Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'

Last Updated : Apr 17, 2022, 4:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.