నెల్లూరు జిల్లా కలిగిరి ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలో గచ్చు అకస్మాత్తుగా కుంగింది. సంఘటనలో ఉపాధ్యాయిని మనోజ, మరి కొందరు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. నేల కుంగిన ప్రాంతంలో పదేళ్ల కిందట బావి ఉండేది. బావిని మట్టితో పూడ్చి తరగతి గదిని నిర్మించారు.
నాపరాళ్లు పగిలి.. గోతిలో పడి:
తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా విద్యార్థులు కూర్చున్న గచ్చు మూడు అడుగులు కుంగిపోయింది. ఉపాధ్యాయురాలి కుర్చీ విరిగి అందులో పడగా.. ఇద్దరు విద్యార్థులు గోతిలో పడిపోయారు. నాపరాళ్లు ముక్కలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే ఉన్న బీరువా కూడా వాలిపోయింది. గోడలు కూలి ఉంటే తీవ్రమైన ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బీరాపేరు వంతెన సమీపంలో ప్రమాదం.. ఇద్దరు మృతి