విద్యుదాఘాతంతో మహిళా రైతు పొలంలో మృతి చెందిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నరసారెడ్డి పాలెంలో జరిగింది. పొలాల్లోని విద్యుత్ లైన్ తీగలు తెగి కింద పడి ఉన్నాయి. మహిళా రైతు లక్ష్మీకాంతమ్మ వరి నారుమడికి నీళ్ళు కట్టేందుకు పొలంలోకి వెళ్ళింది. తెగి పడి ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. అవి తగిలి పొలంలో అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. కలిగిరి ఎస్సై వీరేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. మృతురాలి భర్త 20 ఏళ్ల క్రితం ఇంట్లో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. భార్యాభర్తలిద్దరూ విద్యుదాఘాతంతో మృతి చెందడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: