ETV Bharat / state

పాఠం నేర్వాలంటే పాట్లు పడాల్సిందే..! - నెల్లూరు ప్రభుత్వ పాఠశాలలో వసతుల లేమి

పది గ్రామాల విద్యార్థులకు దిక్కుగా ఉన్న ఆ ప్రభుత్వ పాఠశాలలో వసతుల లేమి వేధిస్తోంది. తరగతి గదులు లేక చెట్ల కిందే విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ విషపురుగుల బారిన పడాల్సి వస్తుందోనని  భయంతో గడుపుతున్నారు.

lack basic facilities in  pallepalem School
పల్లిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతుల లేమి
author img

By

Published : Jan 2, 2020, 6:09 AM IST

పల్లిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతుల లేమి

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. చదువుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. బడి ఆవరణలోకి అడుగుపెట్టగానే అపరిశుభ్ర వాతావరణం వారికి స్వాగతం పలుకుతుంది. చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కల నుంచి ఏ పాము బయటికొస్తుందోనన్న భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు. ఇక ఎలాగోలా చదువుకుందామంటే కనీసం తరగతి గదులు కూడా లేవు. ఆరుబయట, చెట్ల కిందే కూర్చుని పాఠాలు వినాల్సిన దుస్థితి. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు సరైన కాపలా లేక రాత్రివేళల్లో పాఠశాల ఆవరణంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నాలుగు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు

పాఠశాలకు కనీసం 10.. తరగతి గదులు కావాల్సిఉండగా.. కేవలం నాలుగే ఉన్నాయి. అవి కూడా నేడో రేపో కూలిపోయే స్థితిలో ఉన్నాయి. తగినంత మంది సిబ్బంది కూడా లేకపోవటంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. మూడేళ్లుగా 6 నుంచి పదో తరగతి వరకూ ఒకే ఉపాధ్యాయుడు జీవశాస్త్రాన్ని బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులు పడలేక రెండేళ్లలో 50 మంది విద్యార్థులు పాఠశాలను వదిలేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

కనీసం మరో ఐదు అదనపు గదులతో పాటు గ్రంథాలయం, మరుగుదొడ్లను పాఠశాలలో నిర్మించాలని విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ఆతని నాట్యం చూస్తే... అమ్మాయిలైనా అసూయ పడాల్సిందే..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.