సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు కార్మికులు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పరిశ్రమల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యం మారడంతో కార్మికులను కూడా తొలగిస్తున్నారని, పాత బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. నూతన యాజమాన్యం..కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ నేత మోహన్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఛలో కృష్ణపట్నం పోర్టు కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీచదవండి