రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించారని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విమర్శించారు. కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇలా అధికారులను తొలగించటం ఏమిటని ఆయన నిలదీశారు. ఇకనైనా ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలు విడనాడి, కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడాలని సూచించారు. రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలనీ, 200 యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారుల బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: క్వారంటైన్ నుంచి స్వగ్రామాలకు... 247 మంది మత్స్యకారులు