తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని రత్నప్రభను ప్రజలు గెలిపిస్తే... నియోజకవర్గ అభివృద్ధికి తొడ్పడినవారవుతారని... ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ భాజపా అధికారంలో ఉందని... తిరుపతిలో భాజపా అభ్యర్థి గెలుపొందితే కేంద్రమంత్రి అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తూ... తర్వాత వ్యాపారం చేసుకుంటారని విమర్శించారు. తెదేపా, వైకాపా తిరుపతికి ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో తయారైందని ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలున్న బడ్జెట్ సమావేశాలు పెట్టలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఇదీ చదవండి: