ETV Bharat / state

జాషువాకు సేవ చేశాడు...సాహిత్యాన్ని కాపాడుతున్నాడు!

రాజకీయ నాయకుల విగ్రహాలు చెట్టుకోటి పుట్టకోటి కనిపిస్తాయి. గ్రంథాలయాలకంటే..సినిమా హాళ్లే..ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కాదు..సాహిత్యాన్ని అందించిన మహానుభావుల విగ్రహాలు..వారి పేరిట గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలంటున్నారు కిరణ శ్రీ.. చేసి చూపించారు కూడా. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా! ప్రముఖ కవి గుర్రం జాషువా శిష్యుడే.

jashwa_ Disciple_started_gurram_jashwa_library
author img

By

Published : Jul 30, 2019, 10:31 AM IST

ప్రముఖ కవి, సాహిత్యవేత్త గుర్రం జాషువ శిష్యుడు విద్వాన్ కిరణశ్రీ. 1968-71 వరకూ గుంటూరులో జాషువ వద్ద ఉన్నారు. ఆయన చరమాంకంలో మూడేళ్లు సేవచేశారు. ఆప్పుడు కిరణశ్రీ వయస్సు 19ఏళ్లు. జాషువా ఆలోచనలకు ప్రభావితం అయ్యారు. తెలుగుపై అభిమానంతో ఉపాధ్యాయుడిగా మారారు. ఇప్పుడు జాషువా సాహిత్యాన్ని భవిష్యత్​ తరలాకు అందించేందుకు నడుంకట్టారు.
జాషువా చదివారు

కిరణ శ్రీ ప్రకాశం జిల్లా గిద్దలూరు స్థానికుడు. ప్రముఖ కవి జాషువా వద్ద శిష్యరికం చేశాడు. ఆయన చరమాంకంలో సేవ చేశారు. జాషువా వద్ద ఉన్నప్పుడే...అనేక రచనలు చదివేవారు. ఆ సమయంలోనే సులబాంధ్ర వ్యాకరణం, మడివేలు మాచయ్య, కిరణ పంచవింసెటి పుస్తకాలు రచించి ఆయన అభినందనలు పొందారు. జాషువా మరణం తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. నెల్లూరులోని బేస్తవారిపేటలో పనిచేస్తూనే...మరియానీకు శుభం, ఛాఛాజీ, కమిలిన కమలం, పిచ్చివాడు లాంటి 12 పుస్తకాలను రచించారు.

పదిలో ఆయన పుస్తకాలే చదివింది
కిరణశ్రీ 1995లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠ్యపుస్తకాలను రచించారు. రాష్ట్రం విడిపోయే వరకు తరగతిగదిలో విద్యార్ధులు చదువుకునే తెలుసు పుస్తకాలు ఈయన రచించినవే. 2007లో గ్రేడ్ వన్ తెలుగు పండింట్​గా పదవీ విరమణ చేశారు. 2014నుంచి బీసీ గురుకుల పాఠశాలలకు అకాడమిక్ గైడెన్స్ గా ప్రభుత్వం నియమించింది.

పింఛను సైతం
ఇంత చేస్తున్నా..తన గురువు పేరిట ఎదో చేయాలనుకున్నాడు. నెల్లురూలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో మూడేళ్లు పొట్లాడి...గ్రంథాలయ ఏర్పాటుకు భూమి సంపాదించారు. సొంతంగా 4 లక్షల ఖర్చుతో గుర్రం జాషువా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కిరణ శ్రీకి వచ్చే పింఛనులో 15 వేల రూపాయలను ప్రతి నెలా గ్రంథాలయానికే ఖర్చు చేస్తున్నారు. కొంత మంది కిరణ శ్రీకి చేయూతనిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువ సాహిత్యాన్ని ప్రచారం చేసేందుకు కవితాపీఠం పేరుతో కార్యవర్గం కూడా ఏర్పాటు అయ్యింది. ఇలా కవుల విగ్రహాలు ఏర్పాటు చేసేవారు, వారి జ్ఞాపకార్థం గ్రంథాలయాలు నిర్వహించే వారు మనకు అరుదుగా కనిపిస్తారు కదా!

AP_SKLM_01_29_RESERVATION_COUNTER_AVB_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. JULY 29 ------------------------------------------------------------------------------- యాంకర్‌:- శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రిజర్వేషన్‌ కౌంటరును కలెక్టర్‌ నివాస్ ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం మార్గంలో ప్రయాణించే మహిళలు, వయోవృద్ధుల కొరకు ప్రత్యేకంగా కౌంటరును ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు, వయోవృద్ధుల బస్సులలో 50 శాతం సీట్లు రిజర్వేషన్‌ ఇవాళ నుంచి కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సాయంత్రం వేళలలో ప్రయాణీకుల రద్దీ దృష్యా 16 బస్సులలో 50 శాతం సీట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి విజయనగరం మార్గంలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నామన్న కలెక్టర్‌... భవిష్యత్తులో ఇతర మార్గాల్లో కూడా దీనిని అమలు చేస్తామన్నారు...............(Vis+Byte). బైట్‌:- నివాస్, శ్రీకాకుళం కలెక్టర్‌.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.